Best Bhagavad Gita Slokas in Telugu
Chapter 1 Sloka 1
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః । మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।।
భావం: సంజయా! ధర్మానికి నిలయంమైన కూరుక్షేత్రంలో యుద్ద సన్నద్ధులై నిలచిన నా వాళ్ళు, పాండవులు ఏం చేశారు.
Chapter 1 Sloka 32
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ | కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ‖ 32 ‖
భావం: కృష్ణా! యుద్ద విజయం మీద, రాజ్యసుఖలామీద నాకు ఆసక్తి లేదు రాజ్య భోగలతో కుడిన జీవిత ప్రయోజనం ఏమి లేదు.
Chapter 2 Sloka 11
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే | గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 11 ||
భావం: నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గానీ బ్రతికున్న వారి గురించి గానీ, పండితులైనవారు శోకింపరు.
Chapter 2 Sloka 13
దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా । తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ।। 13 ।।
భావం: ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహము లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు.
Chapter 2 Sloka 27
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। 27 ।।
భావం: పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.
Chapter 2 Sloka 47
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన । మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।। 47 ।।
భావం: శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.
Chapter 2 Sloka 56
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః । వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ।। 56 ।।
భావం: దుఃఖముల నడుమ కలతచెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము, మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థిత-ప్రజ్ఞుడైన ముని అని అంటారు.
Chapter 3 Sloka 21
యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః । స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే || 21 ||
భావం: గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే, ప్రపంచమంతా అనుసరిస్తారు.
Chapter 4 Sloka 8
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ । ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 8 ||
భావం: ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.
Chapter 6 Sloka 5
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ । ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।। 5 ।।
భావం: నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు.
Chapter 6 Sloka 35
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ । అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।
భావం: ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.