ది పైథాన్ పారడాక్స్ (The Python Paradox)

ఆగస్టు 2004 లో ఈ వ్యాసం పాల్ గ్రాహం  ఆంగ్లం లో వ్రాసారు. ఇది తెలుగు అనువాదం.

"మీరు ఒక Java ప్రాజెక్ట్  కన్నా Python ప్రాజెక్ట్ మీద పని చేయడానికి తెలివైన  ప్రోగ్రామర్లను  పొందవచ్చు" అని నేను ఇటీవల చర్చ లో అన్న మాటలకు ప్రజలు చాలా  అప్సెట్ అయ్యారు.

దానికి అర్థం  Java  ప్రోగ్రామర్లు మొద్దు అని కాదు. Python ప్రోగ్రామర్లు స్మార్ట్ గా  ఉంటారు అని. ఒక కొత్త ప్రోగ్రామింగ్ భాష నేర్చుకోవడం కష్టమైన పని. ప్రజలు ఒక ఉద్యోగం పొందటానికి Python నేర్చుకోరు. వారు పైథాన్ ఎందుకు నేర్చుకుంటారంటే వారికి స్వచ్ఛంగా ప్రోగ్రామ్మింగ్ అంటే  ఇష్టం మరియు వారికి ఇప్పటికే తెలిసిన భాషలు సంతృప్తి ఇవ్వకపోవడం వలన. అందువల్లే  కంపెనీలు Python ప్రోగ్రామర్లను నియమించుకుంటాయి. ఈ concept కి ఒక మంచి పేరు ఏది తట్టలేదు, అందుకే నేను దీన్నిPython పారడాక్స్ అని పిలుస్తాను.  ఒక సంస్థ software వ్రాయడానికి తులనాత్మకంగా esoteric భాషను  ఎంచుకుంటే, వారు మంచి ప్రోగ్రామర్లను  నియమించుకుంటారు. ఎందుకంటే అలాంటి బాష నేర్చుకోవాలని చాలా కొద్ది మందే కుతూహలంగా ఉంటారు. ప్రోగ్రామర్లకి ఈ పారడాక్స్ మరింత వర్తిస్తుంది. మీరు ఒక మంచి ఉద్యోగం పొందడానికి నేర్చుకునే భాష, ప్రజలు కేవలం ఉద్యోగం పొందడానికి  మాత్రమే నేర్చుకోలేదు.

కేవలం కొన్ని తెలివైన కంపెనీలు మాత్రమె ఇప్పటివరకు ఈ విషయాన్ని గ్రహించాయి. కానీ ఇక్కడ ఇంకో రకమైన ఎంపిక జరగుతోంది. సరిగ్గా  అటువంటి కంపెనీలలోనే  ప్రోగ్రామర్లు పని చేయాలనీ కోరుకుంటున్నారు. ఉదాహరణకు, గూగుల్ Java ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు ప్రకటన ఇచ్చినప్పుడు, వారు Python అనుభవం తప్పనిసరిగా అడుగుతున్నారు.

అన్ని భాషలు విస్తృతంగా ఉపయోగించిన  నా  స్నేహితుడు, దాదాపు అన్ని ప్రాజెక్ట్ ల  కొరకు Python ఉపయోగిస్తాడు. అందుకు ప్రధాన కారణం source code చదవటానికి చాల అనువుగా ఉండటం. ఆ ఒక్క కారణానికి మరొక భాషను ఎంచుకోవడం ఒక అల్పమైన కారణం అని మీరు అనుకోవచ్చు. కాని అది అనుకున్నంత అల్పమైన కారణం కాదు. ఎందుకంటే source code ను రాయడం కంటే చదవడం లో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఒక శిల్పి మట్టి ముద్దల్ని పేర్చుకు పోయినట్లు మీరు కూడా source code blobs ని పేర్చుకుంటూపోతారు. అస్తవ్యస్తంగా పేర్చిన మట్టి ముద్దలు శిల్పిని  చికాకుపరిచినట్లే, చదవటానికి అనువుగా లేని ఒక భాష, ప్రోగ్రామర్ ని చికాకు పరుస్తుంది.

Source code అవలక్షణం ప్రస్తావన వద్ద, ప్రజలు Perl ను గుర్తు చేసుకుంటారు. కానీ నేను మాట్లాడేది Perl యొక్క ఉపరిభాగ సంబంధిత  అందం గురించి కాదు. నిజమైన  అవలక్షణం కఠినంగ కనిపించే వాక్యనిర్మాణం కాదు, కానీ తప్పు patterns ని అనుసరించి ప్రోగ్రమ్స్  వ్రాయటం. Perl ఒక కార్టూన్ పాత్ర తిట్లు వల్లే  ఉండవచ్చు, కానీ కొన్ని చోట్ల అది Python ను అధిగమించిన సందర్భాలు ఉన్నాయి.

ఇప్పటివరకు, ఏమైనప్పటికీ. రెండు భాషలు కదిలే లక్ష్యాలు .  కానీ ఈ రెండు భాషలు కుడా Ruby, (Icon, Joy, J , Lisp & Small Talk) మాదిరి,  నిజంగా ప్రోగ్రామింగ్ పట్టించుకుని,  ఉపయోగించే   ప్రజలచే రూపొందించబడినవి అన్న సత్యాన్ని గుర్తిస్తున్నాయి.


Need further help with this? Feel free to send a message.